తాత వయసులో ఇదేం బుద్ధి? నిద్రిస్తున్న యువతి పట్ల వృద్ధుడి అసభ్య ప్రవర్తన.. వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-05-30 12:26:57  IST  )

బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎంతటి భద్రత ఉందో తెలిపే ఓ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

తాత వయసులో ఇదేం బుద్ధి? నిద్రిస్తున్న యువతి పట్ల వృద్ధుడి అసభ్య ప్రవర్తన.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎంతటి భద్రత ఉందో తెలిపే ఓ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పబ్లిక్‌లో ఓ కుర్చీపై అలిసిపోయి నిద్రిస్తున్న ఓ యువతి పట్ల, ఓ వృద్ధుడు అత్యంత నీచంగా ప్రవర్తించిన తీరు ఇంటర్నెట్ లో తీవ్ర దుమారం రేపుతోంది.

న్యూస్ పేపర్ చాటున కీచక పర్వం

వీడియో ప్రకారం.. పబ్లిక్‌లో ఓ కుర్చీపై యువతి నిద్రిస్తుండగా, ఆమె పక్కనే కూర్చున్న ఓ వృద్ధుడు పేపర్ చదువుతున్నట్లు నటించాడు. న్యూస్ పేపర్‌ను అడ్డుపెట్టుకుని ఆ యువతిని అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఎవరూ గమనించడం లేదనుకున్న ఆ వృద్ధుడి కీచక చర్య మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది.

భగ్గుమంటున్న నెటిజన్లు

ఈ వీడియో చూసిన నెటిజన్లు వృద్ధుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తాత వయసులో ఉండి నిద్రిస్తున్న ఆ ఆడపిల్లకు రక్షణగా నిలవాల్సింది పోయి, ఇలా అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయం’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇలాంటి దుర్మార్గులు ఎవరూ గమనించరు, అడ్డుకోరు అనే ధైర్యంతోనే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు’ అని ఒకరు కామెంట్ చేశారు. ఈ ఘటన చూశాక.. ‘మగవాళ్లు లేని ప్రపంచం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ కొందరు మహిళల భద్రతపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story