- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు షాక్.. పెట్రోల్ ధర పెంపుపై కేంద్ర మంత్రి BIG హింట్
ముడి చమురు ధరల పెరుగుదల వేళ పెట్రో ధరలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ధరల పెంపునకు, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ పెట్రోలియం శాఖ మంత్రి హల్దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామన్నారు. ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు చేర్చినట్లు వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని తట్టుకోవడానికి ప్రధాని మోదీ పిలుపు ఓ మేల్కొలుపు అని 69 రోజులకు సరిపడా ముడి చమురు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ స్టాక్ ఉందన్నారు. సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ధరలు పెరగవని నేను చెప్పడం లేదు:
ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రభుత్వం ధరల సవరణను వాయిదా వేసిందని ఎన్నికలు ముగిసిపోవడంతో ఇక ధరలు పెంచబోతోందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. మేము సవాలును ఒక అవకాశంగా మార్చుకున్నాం. గత నాలుగేళ్లుగా మేము ధరలను పెంచలేదు. ధరలు పెరగవని నేను చెప్పడం లేదు కానీ ధరలకు, ఎన్నికలకు సంబంధం లేదని చెబుతున్నాను అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు రూ.1,000 కోట్లు నష్టపోతున్నాయని మంత్రి అన్నారు. ఈ సంస్థలు వసూళ్ల కింద రూ. 198,000 కోట్లు సంపాదిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నష్టాలు రూ. 1 లక్ష కోట్లుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 15 లోగా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని లీటర్ కు ఏకంగా రూ. 5 వరకు పెంచే చాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.






