- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా నుంచి తగ్గుతూ.. యూఎస్ నుంచి భారీగా పెరుగుతున్న చమురు దిగుమతులు!
రష్యా నుంచి భారత్ చేసుకునే చమురు దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. అదే టైంలో యూఎస్ నుంచి భారీగా పెరుగుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు విలువ భారీగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే రష్యా నుంచి చమురు దిగుమతులు ఈ ఏడాది అక్టోబరు నెలలో ఏకంగా 38 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. విలువ పరంగా ఇది 38 శాతం కాగా, చమురు క్వాంటిటీ పరంగా చూస్తే గత అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో రష్యా నుంచి చమురు దిగుమతులు 31 శాతం తగ్గాయి. ఈ ఏడాది అక్టోబరులో రష్యా నుంచి 3.55 బిలియన్ డాలర్ల విలువైన చమురును భారత్ కొనుగోలు చేసింది. అయితే గతేడాది ఇదే సమయంలో 5.8 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకుంది. క్వాంటిటీ పరంగా చూస్తే.. గతేడాది 103.8 లక్షల టన్నుల చమురు కొనుగోలు చేసిన భారత్.. ఈ ఏడాది 71.6 లక్షల టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుంది.
ఇక సెప్టెంబరు నెలలో చూసుకున్నా కూడా.. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో రష్యా నుంచి చమురు దిగుమతుల్లో ఆదాయం పరంగా 29 శాతం, క్వాంటిటీ పరంగా 17 శాతం తగ్గుదల కనిపించింది. అయితే ఇలా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు భారీగా తగ్గినప్పటికీ.. భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 32 శాతం ఇప్పటికీ రష్యా నుంచే వస్తుండటం గమనార్హం. శుక్రవారం నాడు ప్రధాని మోడీ-ప్రెసిడెంట్ పుతిన్ భేటీలో ఇది కూడా కీలకమైన చర్చనీయాంశంగా మారే అవకాశమున్నదని నిపుణుల అభిప్రాయం. అయితే రష్యా నుంచి ప్రత్యేకంగా చమురు కొనుగోళ్లు తగ్గలేదని, ఓవరాల్‌గా భారత్ చమురు దిగమతుల్లో కూడా గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో 15.4 శాతం తగ్గుదల కనిపించిందని నిపుణులు వివరిస్తున్నారు.
యూఎస్ సుంకాల ప్రభావమా?
అయితే ఇలా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గడానికి యూఎస్ ఆంక్షలు కారణంగా కూడా కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే యూఎస్ ఎలాంటి సుంకాలు ప్రకటించనప్పటి నుంచే రష్యా నుంచి కొనుగోలు చేసే చమురును భారత్ తగ్గిస్తూ వచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కాలంలో నెలవారీ దిగుమతుల వివరాలు చూస్తే.. ఏ ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో రష్యా నుంచి ఆదాయం పరంగా 7.3 శాతం, క్వాలిటీ పరంగా 7.8 శాతం అధికంగా చమురును భారత్ దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
అమెరికా నుంచి పెరిగిన దిగమతులు..
రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గిన సమయంలోనే.. అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ను బాగా పెంచింది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాదిలో యూఎస్ నుంచి ఆదాయం పరంగా 18.3 శాతం, క్వాంటిటీ పరంగా 40 శాతం ఎక్కువ చమురును భారత్ కొనుగోలు చేసింది.






