- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NUPUR BORA: అప్పుడు నీతులు చెప్పి..ఇప్పుడు అవినీతి సొమ్ముతో దొరికిపోయిన అధికారిణి
ఉద్యోగంలో చేరిన సమయంలో పేదరికాన్ని నిర్మూలిస్తానని, పేదలకు సాయం చేస్తానని నీతులు చెప్పిన ఓ సివిల్ సర్వీసెస్ (CIVIL SERVIESES) అధికారిణి కోట్లకు పడగెత్తింది. ఈ ఘటన అస్సాం(ASSAM)లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగంలో చేరిన సమయంలో పేదరికాన్ని నిర్మూలిస్తానని, పేదలకు సాయం చేస్తానని నీతులు చెప్పిన ఓ సివిల్ సర్వీసెస్ (CIVIL SERVIESES) అధికారిణి కోట్లకు పడగెత్తింది. ఈ ఘటన అస్సాం(ASSAM)లో చోటు చేసుకుంది. 2020లో అస్సాం సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన నుపుర్ బోరా (NUPUR BORA) అనే అధికారిణి ప్రస్తుతం కామరూప్ జిల్లా (KAMAROOP) గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ గౌహతిలోని ఆమె నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో బంగారంతో పాటు కోటి రూపాయల నగదును అధికారులు గుర్తించారు. సరైన పత్రాలు లేకుండా దొరికిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పలు వివాదాస్పద భూముల వ్యవహారాల్లో నుపుర్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఆమెపై నిఘా ఉంచినట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ (HIMANTA BISHWA SHARMA) తెలిపారు.
ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇదిలా ఉంటే నుపుర్ బోరా అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో జన్మించారు. 2020లో సివిల్ సర్వీసెస్ కు ఎంపికవ్వగా మొదట కర్బీ అంగ్లాగ్ లో అసిస్టెంట్ కమిషనర్ గా కెరీర్ ప్రారంభించారు. తరవాత 2023లో కామరూప్‌కు సర్కిల్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు. పేదలకు సేవ చేసేందుకే సేవ చేయడానికే సివిల్ సర్వీసెస్ ఎంచుకున్నానని చెప్పి ఇప్పు కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో దొరికిపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె లగ్జరీ జీవితాన్ని గడిపినట్టు ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






