- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవా రక్షక సెయింట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. RSS శిక్షక్ సుభాష్ వెలింగ్కర్‌పై కేసు నమోదు!
గోవాలో మతపరమైన వ్యాఖ్యలు కలకం రేపాయి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ శిక్షక్ సుభాష్ వెలింగ్కర్‌పై కేసు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: గోవా (GOA) ప్రజలు పవిత్రంగా భావించే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ (Saint Francis Xavier) గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను సుభాష్ వెలింగ్కర్ (Subhash Velingkar) అనే ఆర్ఎస్ఎస్ శిక్షక్‌పై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అయితే, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌ను గోవా రక్షక సెయింట్‌గా పిలవడాన్ని తప్పుబడుతూ వెలింగ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను ‘గోవా పితామహుడు’గా పరిగణించలేమని, దానికి బదులుగా పరశురాముడిని పూజించాలని ఆయన పిలుపునిచ్చారు.
భగ్గుమన్న నిరసనలు..
ఈ వ్యాఖ్యలు క్రైస్తవ మతస్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ గోవాలోని వివిధ ప్రాంతాల్లో భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి వెలింగ్కర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టడం వంటి అభియోగాలపై దక్షిణ గోవాలోని బిచోలిం (Bicholim) పోలీసులు సుభాష్ వెలింగ్కర్ కేసు నమోదు చేశారు. మరోవైపు గోవాలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని విపక్షాలు హెచ్చరించాయి. ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడాలని డిమాండ్ చేశాయి.






