అటవీశాఖ అధికారి ఇంట్లో విజిలెన్స్ సోదాలు.. భారీగా నగదు, బంగారం స్వాధీనం

by Naga Rani Yarlagadda |

అటవీశాఖ అధికారి రామచంద్ర నేపక్ ఇంట్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన ఇల్లు, ఆఫీస్, సహా 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

అటవీశాఖ అధికారి ఇంట్లో విజిలెన్స్ సోదాలు.. భారీగా నగదు, బంగారం స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని అటవీశాఖ అధికారి రామచంద్ర నేపక్ ఇంట్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన ఇల్లు, ఆఫీస్, సహా 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సోదాల్లో రామచంద్ర ఇంట్లో భారీగా కూడబెట్టిన నగదు, బంగారం లభ్యమవ్వగా.. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ 16 బంగారు నాణేలు, రూ.1.44 కోట్ల నగదును గుర్తించినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కాగా.. ఒక్కో బంగారు నాణెం 10 గ్రాములు ఉంటుందని తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Next Story