Nuclear weapons: పాక్ కంటే భారత్‌లోనే ఎక్కువ అణ్వాయుధాలు.. సిప్రి నివేదికలో వెల్లడి

by B.Srinivas |

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రంగా మారుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా భద్రతా పరిస్థితులపై ఆందోళన నెలకొంది.

Nuclear weapons: పాక్ కంటే భారత్‌లోనే ఎక్కువ అణ్వాయుధాలు.. సిప్రి నివేదికలో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ఇరాన్ (Israel Iran) యుద్ధం తీవ్రంగా మారుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా భద్రతా పరిస్థితులపై ఆందోళన నెలకొంది. అణు సంఘర్షణ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. పాక్ కంటే భారత్ వద్దే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయని తెలిపింది. న్యూక్లియర్ వెపన్స్ సామర్థ్యాలు భారత్ వద్దే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. అయితే పాక్ అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి వనరులను సేకరిస్తోందని, త్వరలో దాని సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

భారత్ వద్ద దాదాపు180 న్యూక్లియర్ వెపన్స్

సిప్రి నివేదిక ప్రకారం .. 2025 నాటికి భారత్ వద్ద దాదాపు180 అణ్వాయుధాలు ఉన్నాయి. గతేడాది 172 ఉండగా స్వల్పంగా మెరుగవడం గమనార్హం. భారత్ అణ్వాయుధ నిల్వలను పెంచడమే గాక ఆయుధాలను మోసుకెళ్లడానికి ఆధునిక క్షిపణులను సైతం అభివృద్ధి చేసిందని తెలిపింది. అలాగే భారత్ కొత్త క్యానిస్టరైజ్డ్ మిస్సైల్స్ ఎంతో సురక్షితమైనవని పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఒకే క్షిపణితో బహుళ అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని తెలిపింది. ఇదే టైంలో పాక్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయని వెల్లడించింది. అయితే ఆ దేశం ఆయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉందని తెలిపింది.

అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటున్న చైనా

చైనా తన అణ్వాయుధ నిల్వలను అత్యంత వేగంగా పెంచుకుంటుందని సిప్రి తెలిపింది. చైనా వద్ద ప్రస్తుతం 600 అణ్వాయుధాలు ఉండగా 2023 నుంచి ప్రతి ఏటా100 అణ్వాయుధాలను తయారు చేస్తుందని తెలిపింది. ఈ సంఖ్య మరింత ఎక్కువగా పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అణుశక్తిగా చైనా ఉంది. 2035 నాటికి 1500 వార్ హెడ్‌లను కలిగి ఉండనుందని తెలిపింది. ఇక సిప్రి నివేదిక ముఖ్యంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణ్వాయుధాలకు సంబంధించిన వివరాలను వెల్లడింది.

Next Story