Supreme Court: రాష్ట్రపతికి గడువు.. స్పందించిన ధంఖర్

by Shamantha N |

పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ (Vice-President Jagdeep Dhankhar) స్పందించారు.

Supreme Court: రాష్ట్రపతికి గడువు.. స్పందించిన ధంఖర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ (Vice-President Jagdeep Dhankhar) స్పందించారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయ రాజ్యాంగ విధిని దెబ్బతీస్తుందని అన్నారు. ఆర్టికల్ 145(3) కింద చట్టాన్ని అర్థం చేసుకునే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇస్తుందని, కానీ కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఇవ్వలేదని ఆయన అన్నారు. “రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్న ఏకైక హక్కు ఆర్టికల్ 145(3) కింద రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది జడ్జిలు ఉండాలి” అని ధంఖర్ అన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు

శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా సమయం వృథా చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. కేసు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించిన 3 నెలల వ్యవధిని.. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపించిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడమని భావించినట్లు ధర్మాసనం తెలిపింది.

Next Story