పూలకు బదులు పండ్లు, స్నాక్స్.. పెళ్లి కారుకు వెరైటీ డెకరేషన్

by Prasad Jukanti |   (  Updated:2026-04-14 11:41:41  IST  )

ఒక వరుడు తన పెళ్లి కారును పూలకు బదులు రకరకాల పండ్లు, స్నాక్స్ ప్యాకెట్లతో వినూత్నంగా అలంకరించాడు.

పూలకు  బదులు పండ్లు, స్నాక్స్.. పెళ్లి కారుకు వెరైటీ డెకరేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే పెళ్లి వేడుకల్లో ప్రతీది ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇక పెళ్లి కారు అంటే రంగురంగుల పూలు, రిబ్బన్లతో అందంగా అలంకరిస్తుంటారు. కానీ ఇలా డెకరేషన్ చేయడం ఇక ఓల్డ్ ట్రెండ్ గా మారింది. తాజాగా పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో కొత్త రకంగా కారును డెకరేషన్ చేయడం వైరల్ అవుతోంది. తాజాగా తన పెళ్లి కారును ఇలాగే పండ్లు, ఫ్రూట్స్ తో ముస్తాబు చేసి ఓ వరుడు అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వెరైటీ కార్ డెకరేషన్‍కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్నాక్స్ వెడ్డింగ్ కార్:

రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్‌, ఆపిల్స్‌ ఇలా వెరైటీ ఫ్రూట్స్ తో కారు విండ్‌షీల్డ్, బాడీ అంతా నింపేశాడు. పూలతా కాకుండా సపరేట్‍గా పండ్లతో అలంకరించిన పెళ్లి కారు ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వినూత్న అలంకరణపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజంగానే స్నాక్స్ లవర్స్ పెళ్లిలా ఉందని ఒకరు కామెంట్ చేయగా, చిన్న పిల్లలు ఈ కారును చూస్తే డెకరేషన్ అంతా ఖాళీ కావడం ఖాయం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్నాక్స్ వెడ్డింగ్ కార్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Next Story