- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
25,000 మంది ఉపాధ్యాయుల తొలగింపు
నియామకాలు పొందిన వారందరూ తప్పులకు పాల్పడలేదని, అభ్యర్థులందరినీ తొలగించడం ఏంటని మమత బెన్జీ ప్రశ్నించారు.

- కోలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
- ఆ పాతిక వేల మందిలో అందరూ దోషులు కాదన్న మమత
- సుప్రీం తీర్పును వ్యతిరేకించిన మమత బెనర్జీ
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 25,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ తప్పబట్టారు. ఆ పాతిక వేల మందిలో అందరూ తప్పు చేసిన వారు కాదని అన్నారు. ఈ తీర్పును తాను సమర్థించబోనని చెప్పారు. ఈ 25 వేల మంది నియామకాలు రద్దు చేయబడ్డాయని కోర్టు చెబుతోంది. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి ఇచ్చిన జీతాలు, అలవెన్సులను తిరిగి చెల్లించాలని అడగాల్సిన అవసరం లేదని మమత గురువారం పేర్కొన్నారు. 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్‌సీ) పాఠశాల ఉద్యోగాలతో నగదు కుంభకోణానికి సంబంధించి 25 వేల మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ఎంపిక ప్రక్రియ 'దుర్మార్గం, కళంకం'గా కోర్టు అభివర్ణించింది.
అయితే నియామకాలు పొందిన వారందరూ తప్పులకు పాల్పడలేదని, అభ్యర్థులందరినీ తొలగించడం ఏంటని మమత బెన్జీ ప్రశ్నించారు. మీరు కళంకితులు అని పిలిచే వారికి సంబంధించిన ఆధారాలు అయితే మా దగ్గర లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెంగాల్ విద్యా వ్యవస్థను కూల్చాలని కోరుకుంటుందా అని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం జరిగింది. 50 మందికి పైగా మరణించారు. మరి దానిపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రస్తావిస్తూ.. తప్పు చేయని అభ్యర్థులు తాజా ఎంపిక ప్రక్రియకు హాజరుకావొచ్చని కోర్టు ఆర్డర్‌లో ఉంది. మేం తీర్పును గౌరవించి.. మూడు నెలల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. డబ్ల్యూబీఎస్ఎస్సీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.. అది తప్పకుండా ఉపాధ్యాయుల పునఃనియామక ప్రక్రియ పూర్తి చేస్తుందని మేం భావిస్తున్నామని అన్నారు. అయితే ఈ ఉత్తర్వుల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
బీజేనీ, సీపీఎం పాత్ర కూడా ఉందని పేర్కొన్నారు. కలకత్తా హైకోర్టులో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయమూర్తి ఇప్పుడు బీజేపీ ఎంపీ.. ఇది తప్పకుండా ఆ రెండు పార్టీల పనే అని అన్నారు. ఏప్రిల్ 7న బాధిత ఉపాధ్యాయుల సమావేశంలో తాను పాల్గొంటానని మమత బెనర్జీ ప్రకటించారు. ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు ఎవరూ ఆశ కోల్పోవద్దని ఆయన పేర్కొన్నారు. మీరందరూ దరఖాస్తు చేసుకొండి.. నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూద్దామని అన్నారు.






