Floods : వరద గుప్పిట్లో ఈశాన్య రాష్ట్రాలు.. ప్రధాని ఫోన్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-03 06:46:07  IST  )

అసోం, సిక్కిం, మణిపూర్‌లలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి.

Floods : వరద గుప్పిట్లో ఈశాన్య రాష్ట్రాలు.. ప్రధాని ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్ : అసోం, సిక్కిం, మణిపూర్‌లలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దాదాపు ఈశాన్య రాష్ట్రాలన్నీ(North East States) వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేడు అసోం సీఎం హిమంత బిస్వాశర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో వరదల(Massive Floods) వల్ల జనజీవనం అస్తవ్యస్తమై, పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో.. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసోంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడి, కొండచరియలు విరిగి పడ్డాయి.

సిక్కిమ్‌లో జాతీయ రహదారులు కొట్టుకుపోవడం.. మణిపూర్‌లో ఇంఫాల్‌తో సహా పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సందర్భంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం(NDRF) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. ప్రధాని ఈ సహాయక చర్యలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ హామీతో పాటు, కేంద్రం నుంచి ఆర్థిక, లాజిస్టికల్ సహాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. అయితే సహాయక చర్యల్లో పాల్గొంటున్న విపత్తు నిర్వహణ సహాయక బృందాలపై కొండ చర్యలు విరిగి పడటంతో ముగ్గురు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ భారీ వరదల వల్ల ఇప్పటికే 36 మంది మరణించారు. వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Next Story