- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సర్కే చునార్’ వివాదం.. జాతీయ మహిళా కమిషన్ ఎదుట క్షమాపణలు చెప్పిన నోరా ఫతేహి
‘కేడీ ది డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునార్’ అనే పాట వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘కేడీ ది డెవిల్’ చిత్రంలోని ‘సర్కే చునార్’ అనే (Sarke Chunar) పాట వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి స్పందించారు. ఈ పాటలో మహిళలను కించపరిచే లిరిక్స్, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో గురువారం నోరా ఫతేహి ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ (NCW) ఎదుట హాజరై రాతపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు. అనంతరం నోరా మీడియాతో మాట్లాడుతూ.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ‘నన్ను ఆ పరిస్థితిలోకి నెట్టారు. ఒక పబ్లిక్ ఫిగర్‌గా, ఆర్టిస్ట్‌గా నా బాధ్యత నాకు తెలుసు. అందుకే రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాను. నేను కేవలం కన్నడ వెర్షన్‌కు మాత్రమే షూట్ చేశాను (ఆ భాష నాకు రాదు). నా అనుమతి లేకుండానే దాన్ని హిందీలోకి మార్చారు. అందరిలాగే హిందీ లిరిక్స్ చూసి నేను కూడా షాక్ అయ్యాను’ అని నోరా వివరించారు.
అనాథ బాలికల చదువుకు సాయం
సమాజానికి తన వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో, కొంతమంది అనాథ బాలికల చదువుకు స్పాన్సర్ చేయనున్నట్లు నోరా ఫతేహి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇదే పాట వివాదంలో గత నెలలో నటుడు సంజయ్ దత్ సైతం మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణలు చెప్పడంతో పాటు, 50 మంది గిరిజన బాలికల విద్యకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అసలు వివాదం ఏమిటంటే..
మార్చి 15న యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట హిందీ వెర్షన్‌లో మహిళలను కించపరిచేలా అసభ్యకరమైన పదజాలం ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. కంగనా రనౌత్, రవికిషన్, గాయకుడు అర్మాన్ మాలిక్ వంటి ప్రముఖులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన చిత్ర బృందం యూట్యూబ్ నుంచి హిందీ వెర్షన్‌ను తొలగించింది. ఇప్పటికే ఈ పాట పాడిన సింగర్ మంగ్లీ, గేయ రచయిత, గాయకుడు, దర్శకుడు కూడా క్షమాపణలు చెప్పారు.






