- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు
భారత విశిష్ట పురస్కారాలైన పద్మ అవార్డులకు(Padma Awarads) నామినేషన్స్ కు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత విశిష్ట పురస్కారాలైన పద్మ అవార్డులకు(Padma Awarads) నామినేషన్స్ కు కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2026 పద్మ అవార్డుల కోసం నామినేషన్/సిఫార్సుల గడువును జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నామినేషన్‌లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ వంటి పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా పరిగణించబడతాయి.
1954లో స్థాపించబడిన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, విజ్ఞానం, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం మరియు పరిశ్రమ వంటి వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలు అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తులకు ఇవ్వబడతాయి.






