- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యూటీ పార్లర్ ముసుగులో పాడుపని.. ఆరుగురు అరెస్ట్
ఉత్తరప్రదేశ్ నోయిడా పోలీసులు ఓ ముఠా గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థగా నటిస్తూ.. జనాలను మోసం చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బ్యూటీ పార్లర్ ముసుగులో నడిపిస్తున్న ఈ ఇంటర్నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఫేస్ ఆఫీసును గుర్తించిన

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ నోయిడా పోలీసులు ఓ ముఠా గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థగా నటిస్తూ.. జనాలను మోసం చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బ్యూటీ పార్లర్ ముసుగులో నడిపిస్తున్న ఈ ఇంటర్నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఫేస్ ఆఫీసును గుర్తించిన పోలీసులు.. ఇంటర్‌పోల్, యురేషియా పోల్‌తో సంబంధం ఉన్నట్లు నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులు బిభాష్ చంద్ర, అరాఘ్య, బాబుల్‌చంద్, పింటుమల్, సమపద్మల్, ఆశిష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ వెరిఫికేషన్ పేరుతో జనాల నుంచి పెద్దమొత్తాల్లో డబ్బులు లాగారని తెలిపిన పోలీసులు.. మంత్రిత్వ శాఖల పేర్లతో ఉన్న నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రోజురోజుకు మనుషులపై నమ్మకం పోతుందని అంటున్నారు నెటిజన్లు.






