- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..ఆవిష్కరణ, ఆధారిత ఆర్థిక వృద్ధి సిద్ధాంతానికి పట్టం
2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు ప్రముఖ ఆర్థిక వేత్తలకు నోబెల్ (స్వీడిష్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ అల్ఫ్రెడ్ నోబెల్) బహుమతి దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: 2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు ప్రముఖ ఆర్థిక వేత్తలకు నోబెల్ (స్వీడిష్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ అల్ఫ్రెడ్ నోబెల్) బహుమతి దక్కింది. ఈ అవార్డులు అందుకోబోయే వారిలో జోయెల్ మోకిర్ (Joel Mokyr), ఫిలిప్ అఘియన్ (Philippe Aghion) పీటర్ హౌయిట్ (Peter Howitt) ఉన్నారు. అయితే, ‘ఇన్నోవేషన్-డ్రైవెన్ ఆర్థిక వృద్ధి’ని వివరించినందుకు గాను నోబెల్ వారి సొంతమైంది. జోయెల్ మోకిర్ అమెరికన్-ఇజ్రాయెల్ ఆర్థిక చరిత్రకారుడు, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి ఆర్థిక వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేశారు. ఇక ఫిలిప్ అఘియన్ ఫ్రెంచ్-బ్రిటిష్ ఆర్థికవేత్త, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆవిష్కరణలు, పోటీ, వృద్ధి మధ్య సంబంధాన్ని మోడల్స్ ద్వారా వివరించారు. మరో శాస్త్రవేత్త పీటర్ హౌయిట్ కెనడియన్ ఆర్థికవేత్త, బ్రౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థలో ఎలా పనిచేస్తాయో గణితీయ మోడల్స్‌తో ప్రపంచానికి చూపించారు. నోబెల్ బహుమతి విలువ 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 12 మిలియన్ అమెరికన్ డాలర్లు) కాగా ముగ్గురికి సమానంగా పంచనున్నారు.






