- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారువేషంలో వెనుజులా నుంచి నార్వేకు చేరిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
వెనుజులా విపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో మారువేషంలో వెనుజులా నుంచి నార్వే చేరారు.

దిశ, వెబ్ డెస్క్ : వెనుజులా విపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో మారువేషంలో వెనుజులా నుంచి నార్వే చేరారు. అయితే గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్న మచాడో నార్వేకు చేరడం వెనుక అమెరికా మాజీ సైనికుల రహస్య ఆపరేషన్ ఉందని వినిపిస్తోంది. వెనుజులా ప్రభుత్వం మచాడో మీద నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తనకు లభించిన నోబెల్ బహుమతిని పొందేందుకు నార్వే వెళ్లాలని నిర్ణయించుకుని, గ్రే బుల్ రెస్క్యూ ఫౌండేషన్‌ను సంప్రదించగా, వారి నేత బ్రెయాన్ స్టెర్న్ 'ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్' అనే రహస్య ఆపరేషన్ రూపొందించారని సమాచారం.
అందులో భాగంగా కారకస్ నుంచి సముద్ర మార్గంలో చేపల పడవల ద్వారా ఆమెను కరేబియన్ తీరానికి తరలించి, మారువేషంలో డిజిటల్ ఆనవాళ్లు లేకుండా ప్రత్యేక విమానంలో నార్వేకు చేర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఆపరేషన్‌కు దాదాపు మూడు రోజులు పట్టిందని, సాయం చేసిన స్థానికుల భద్రత దృష్ట్యా వివరాలు గోప్యంగా ఉంచామని స్టెర్న్ తెలిపారు. గతేడాది వెనెజువెలా ఎన్నికల్లో అవకతవకల ఆరోపణలతో నిషేధానికి గురైన మచాడో, దేశంలో ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి-2025 కి ఎంపికయ్యారు. కాగా ఆమె ఆలస్యంగా నార్వే చేరడంతో పురస్కారాన్నిమచాడో కుమార్తె స్వీకరించిన సంగతి తెలిసిందే.






