- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దు
బహిరంగ ప్రదేశాల్లో లేదా పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. పని ప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వం తప్పేమి కాదంది.

దిశ, నేషనల్ బ్యూరో: బహిరంగ ప్రదేశాల్లో లేదా పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. పని ప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వం తప్పేమి కాదంది. ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్ కేర్ గదుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం.. మహిళలు తమ పిల్లలకు ఎలాంటి సవాళ్లు లేకుండా పాలిచ్చేందుకు సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాలిచ్చే తల్లుల సౌలభ్యం కోసం బహిరంగ ప్రదేశాలు లేదా పని ప్రదేశాలలో నర్సింగ్ గదులకు నిబంధనలు ఉండాలని ధర్మాసనం నిర్ణయించింది.
తల్లిబిడ్డ ప్రాథమిక హక్కు
మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లులకు తమ బిడ్డ సంరక్షణలో అది ఒక భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి ప్రాథమిక హక్కు అని అభిప్రాయపడింది. పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని అవమానంగా ధర్మాసనం వెల్లడించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ప్రభుత్వ భవనాలలో పిల్లలకు పాలివ్వడానికి ప్రత్యేక గదులను కేటాయించాలని సూచించింది. మహిళలు ఉన్న ప్రతి కార్యాలయంలో నర్సింగ్ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంది. ఏ ప్రదేశంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తల్లిపాలు ఇవ్వడంపై అవగాహన కల్పించడానికి ప్రచారాలు నిర్వహించాలని సూచించింది.






