- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JaiShankar: భారత్-చైనా సంబంధాల్లో మూడో పక్షానికి చోటు లేదు: ఎస్ జైశంకర్
రెండు దేశాలకు సంబంధించిన అంశాల్లో మరో పక్షానికి జోక్యం ఉండకూడదని వాంగ్ యీతో తేల్చి చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2020లో తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ని దాటిన తర్వాత భారత్-చైనా మధ్య మెరుగుపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో పక్షానికి (పాకిస్తాన్) చోటు లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్ అక్కడ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించిన అంశాల్లో మరో పక్షానికి జోక్యం ఉండకూడదని వాంగ్ యీతో తేల్చి చెప్పారు. ఇదే సమయంలో గత అక్టోబర్‌లో చైనాతో కుదురిన ఒప్పందంలో భాగంగా డెప్సాంగ్, డామ్‌చోక్‌లలో భారత సైన్యం పెట్రోలింగ్ పునరుద్ధరణ జరగడంపై జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దుల్లో స్థిరమైన పరిస్థితులు కీలకమని, తూర్పు లద్దాఖ్‌లో అతిక్రమణ, గాల్వాన్ ఘర్షణ జరిగి ఐదేళ్లు గడిచినందున ఇప్పుడు రెండు దేశాల సైన్యం ఉద్రిక్తతలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా, రెండు దేశాల మధ్య వస్తువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, భారత్‌కు ఎగుమతుల విషయంలో ఎటువంటి పరిమితులను విధించకూడదని జైశంకర్ ఆ దేశ పొలిట్‌బ్యూరో సభ్యుడు వాంగ్‌కు స్పష్టం చేశారు. కాగా, రెండు రోజుల పర్యటనకు చైనాకు వెళ్లిన జైశంకర్, షాంఘై సహకార సమ్ష్త(ఎస్‌సీఓ) కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కలిసి ద్వపాక్షిక సంబంధాలపై చర్చించారు.






