- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో ప్రజలకు భద్రత లేదు.. మమత సర్కారుపై ప్రధాని విమర్శల వర్షం
బెంగాల్‌లో ప్రజలకు భద్రత లేదని, మహిళలపై అత్యాచారాలు చేసేవారిని టీఎంసీ సర్కారు కాపాడుతోందని ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, అత్యాచారాలకు పాల్పడుతున్న దుర్మార్గులను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కాపాడుతోందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ఆయన.. ఆయిల్, గ్యాస్, పవర్, రైల్, రోడ్డు రంగాల్లో మొత్తం రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘ఒక యువ డాక్టర్‌పై ఎంత అఘాయిత్యం జరిగిందో అందరూ చూశారు. ఈ కేసులో నిందితుడిని కాపాడేందుకు టీఎంసీ ప్రభుత్వం కలగజేసుకుంది. ఆ ఘోరాన్ని దేశం మర్చిపోకముందే మరో కాలేజీలో మరో యువతిపై అఘాయిత్యం జరిగింది. ఆ కేసులో కూడా నిందితుడికి టీఎంసీతో సంబంధాలున్నాయి’ అని మోడీ అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను నిలబెట్టడంలో, ప్రజలకు భద్రత కల్పించడంలో టీఎంసీ సర్కారు పూర్తిగా విఫలమైందని ప్రధాని ఆరోపించారు.
‘ముర్షీదాబాద్ వంటి నిరసనలు జరిగినప్పుడు పోలీసులు గుడ్డిగా ముందుకెళ్లి, సొంతంగా ప్రజలపై చర్యలు తీసుకుంటారు. అసలు ఈ రాష్ట్రంలో న్యాయమనేది మచ్చుకు కూడా లేకుండా పోయింది. ప్రజల ప్రాణాలను కూడా ప్రభుత్వం కాపాడలేకపోతోంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బెంగాల్‌లో బిజినెస్‌లు పెట్టాలనుకునే వారి నుంచి టీఎంసీ సర్కారు మామూళ్లు వసూలు చేస్తోందని మోడీ ఆరోపించారు.
‘బెంగాల్‌లో వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్లను టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారు. ఈ ‘గూండా ట్యాక్స్’ కట్టకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా వారిని అడ్డుకుంటున్నారు’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి జరగడం టీఎంసీకి ఇష్టం లేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా పురూలియా, బంకురాల్లో రూ.1950 కోట్లతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేస్తున్న సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. అదే విధంగా దుర్గాపూర్-హల్దియా నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థలో రూ.1190 కోట్లతో నిర్మించిన 132 కిలోమీటర్ల పొడవైన దుర్గాపూర్-కోల్‌కతా సెక్షన్‌ను జాతికి అంకితం చేశారు.






