- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Centre: పని గంటలను పెంచే ప్రతిపాదన లేదు: కేంద్రం
పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. పని గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. కార్మిక శాఖ ఉమ్మడి జాబితా అని.. ఆ చట్టాల అమలును రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రం వారి అధికార పరిధిలో పనిచేస్తాయని వెల్లడించారు. చట్టాల అమలు కేంద్ర రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ (CIRM) తనిఖీ అధికారులు చూడగా.. రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తాయన్నారు. ఇకపోతే, వారానికి 70- 90 పనిగంటల గురించి బడ్జెట్ సమావేశాలకు ముందు ఆర్థిక సర్వే గత అధ్యయనాలను ఉదహరించింది. వారానికి 60 గంటలకు పైగా పని కోసం గడపడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని పేర్కొంది. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల మానసిక శ్రేయస్సుకు హానికరం అని చెప్పుకొచ్చింది.






