- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maharashtra: పార్కింగ్ లేదా.. అయితే కార్లు అమ్మవద్దు.. మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం
మహారాష్ట్ర ప్రభుత్వం కార్ల విక్రయాలపై కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. పార్కింగ్ స్థలం లేకపోతే, కార్లు అమ్మవద్దనే నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు రెడీ అయ్యింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ప్రభుత్వం కార్ల విక్రయాలపై కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. పార్కింగ్ స్థలం లేకపోతే, కార్లు అమ్మవద్దనే నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ (car parking) స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అన్నారు. అయితే, ముంబైలోని పలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారని అన్నారు. దీంతో, ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందన్నారు. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సివస్తోం. అంతేకాకుండా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించేందుకు ఈ నిబంధనను తీసుకొస్తున్నట్లు ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.
ప్రజారవాణా కోసమే..
అయితే, ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు, ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అదనంగా ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చిస్తున్నామన్నారు.






