Trump: వైట్ హౌస్ లో మస్క్ కు ప్రత్యేక కార్యాలయం

by Shamantha N |

వైట్‌హౌస్‌ (White House)లో బిలియనీర్, టెస్లా అధినేత మస్క్‌ (Elon Musk)కు ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) క్లారిటీ ఇచ్చారు.

Trump: వైట్ హౌస్ లో మస్క్ కు ప్రత్యేక కార్యాలయం
X

దిశ, నేషనల్ బ్యూరో: వైట్‌హౌస్‌ (White House)లో బిలియనీర్, టెస్లా అధినేత మస్క్‌ (Elon Musk)కు ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌస్‌లోని పశ్చిమవైపు ఉన్న ఓవల్‌ ఆఫీస్‌లో మస్క్‌కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే, మస్క్ సారథ్యంలో పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, అది వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో కాదని స్పష్టం చేశారు. అయితే, వైట్ హౌస్ లోని పశ్చిమ భాగంలో ఏర్పుట చేస్తున్న ఆఫీస్ ప్రభుత్వానికి చెందిన వివిద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను చర్చించడం కోసం రెడీ చేస్తున్నట్లు తెలిపారు. తన బృందంలో దాదాపు 20 నుంచి 25 మంది ఉన్నారని.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల అమలు, సలహాలు, సూచనలు మొదలైన విషయాలను వారితో చర్చించేందుకు వీలుగా ఈ ప్రత్యేక ఆఫీస్‌ ఏర్పాటు చేస్తున్నామని ట్రంప్‌ తెలియజేశారు.

డోజ్ ఏర్పాటు

ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్‌ మస్క్‌ ట్రంప్ నకు పూర్తి మద్దతు అందించారు. స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌.. తన పాలకవర్గంలోకి మస్క్‌ను తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(DOGE)కి హెడ్ గా నియమించారు. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్‌ పని చేస్తోంది.

Next Story