మొబైల్ ఫోన్ల చోరీకి ఇక ఎండ్ కార్డ్..! కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ఆ ప్రభుత్వ యాప్‌

by Kema Shiva Kumar |

దేశంలో అమ్మే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ల (Smart Phones)పై త్వరలోనే సంచలన ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది.

మొబైల్ ఫోన్ల చోరీకి ఇక ఎండ్ కార్డ్..! కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ఆ ప్రభుత్వ యాప్‌
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అమ్మే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ల (Smart Phones)పై త్వరలోనే సంచలన ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) యాప్‌ను తప్పనిసరిగా కొత్త మొబైల్ ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్ (Pre-Install) చేయాలని మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సంచలన కథాన్ని ప్రచురించింది. రాబోయే 90 రోజుల్లోపు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, మొబైల్ యూజర్లు ఈ యాప్‌ను డిసేబుల్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేయలేరట.

మొబైల్ దొంగతనం, నకిలీ ఫోన్లు, సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ యాప్ రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారని తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఆయా రాష్ట్రాల పోలీసులు ఇదే యాప్ ద్వారా కనుగొని తిరిగి యజమానులకు అందించారు. ఇప్పటి వరకు ఆరోగ్య సేతు, డిజిలాకర్ (Digi Locker), ఉమంగ్ (Umang) వంటి ప్రభుత్వ యాప్‌లు కొన్ని ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్ అయ్యేవి. కానీ, ప్రస్తుతం ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త ఫోన్లలో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయడం వల్ల ప్రభుత్వ యాప్‌ల జాబితాలో మరింత కఠినమైన నిబంధన వచ్చి చేరబోతోందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story