Breaking News : వారికి నో లంచ్, టాయిలెట్ బ్రేక్

by Muthe.Rajitha |

ఎలాంటి ఉద్యోగం చేసే వారికి అయినా కనీసం 10 నిముషాలు అయినా బ్రేక్ ఇస్తుంది సదరు సంస్థ.

Breaking News : వారికి నో లంచ్, టాయిలెట్ బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలాంటి ఉద్యోగం చేసే వారికి అయినా కనీసం 10 నిముషాలు అయినా బ్రేక్ ఇస్తుంది సదరు సంస్థ. కానీ విచిత్రంగా ఓ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు లంచ్ బ్రేక్(Lunch Break) కాదు కదా.. కనీసం టాయిలెట్ బ్రేక్(Toilet Break) కూడా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇది వేరే ఎక్కడో కాదు మన దేశంలోనే. అదీ భారత రైల్వేశాఖ(Indian Railways)లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పట్ల రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం. అయితే తమకు లంచ్ బ్రేక్, టాయిలెట్ బ్రేక్ ఇవ్వాలని లోకో పైలెట్స్ విజ్ఞప్తి చేయగా.. దానిని రైల్వేశాఖ తిరస్కరించింది.

రైలు ప్రమాదాలు పెరుగుతుండటం, అందులోనూ మానవ తప్పిదాల వలనే ఆయా ప్రమాదాల సంఖ్య ఎక్కువ ఉండటం కారణంగా చూపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే పైలట్ల క్యాబిన్లో వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడాన్ని రైల్వేశాఖ సమర్థించుకుంది. దీనివల్ల సిబ్బంది ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. అయితే రైల్వేశాఖ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

Next Story