US Dollar : అమెరికా డాలర్‌ను బలహీనపర్చే ఉద్దేశం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్

by Hajipasha |
US Dollar : అమెరికా డాలర్‌ను బలహీనపర్చే ఉద్దేశం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా డాలర్‌(US Dollar)ను బలహీనపర్చే ఉద్దేశమేదీ భారత్‌కు లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(Jaishankar) స్పష్టం చేశారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఇకపైనా కొనసాగుతుందన్నారు. ‘‘మేం డాలర్‌(Dollar)ను బలహీనపర్చే చర్యలను ఎన్నడూ చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు బ్రిక్స్ కరెన్సీని తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదు. కేవలం ఆర్థిక లావాదేవీలపైనే బ్రిక్స్ కూటమి సదస్సుల్లో చర్చిస్తుంటాం’’ అని జైశంకర్ తెలిపారు.

శనివారం ఖతర్‌లో జరిగిన దోహా ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్‌తో భారత్‌కు బలమైన బంధం ఉంది. ఇకపైనా ఇరుదేశాల సంబంధాలు అదే రీతిలో కొనసాగుతాయి’’ అని విదేశాంగ మంత్రి చెప్పారు. ‘‘పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. వాణిజ్యం బాగా దెబ్బతింది. ఆ ప్రభావాన్ని భారత్ ఫీలవుతోంది’’ అని జైశంకర్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిచర్చల కోసం గతంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story