రూ. 2 వేల నోటు మార్పిడికి ఎలాంటి ఫారం అవసరంలేదు: ఎస్‌బీఐ

by Dishanational2 |
రూ. 2 వేల నోటు మార్పిడికి ఎలాంటి ఫారం అవసరంలేదు: ఎస్‌బీఐ
X

న్యూఢిల్లీ: ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే, సోషల్ మీడ్యాలో నోట్ల మర్పిడికి సంబంధించి ఫారం నింపాలనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా 2000 నోట్లను మార్చుకోవడానికి గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఊహాగానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఆదివారం ట్విటర్ వేదికగా, రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ఎలాంటి ఫారంలను నింపాల్సిన పనిలేదని, బ్యాంకుల్లో నిర్దేశించిన గరిష్ఠం రూ. 20 వేల వరకు మార్చుకోవచ్చని తెలిపింది. గుర్తింపు కార్డు కూడా అవసరంలేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమ బ్యాంకు బ్రాంచులకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేసింది. కాగా, గత శుక్రవారం ఆర్‌బీఐ చలామణిలో ఉన్న రూ. 2,000 నోటును ఉపసంహరిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువును నిర్దేశించింది.

Also Read...

ఎలాంటి ఐడీ అవసరం లేదు.. 2 వేల నోట్ల మార్పుపై SBI క్లారిటీ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed