- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NMC: వైద్య విద్యలో ఫ్యాకల్టీ కొరతకు చెక్.. ఎన్ఎంసీ కీలక మార్పులు
మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యతను పెంచడానికి, ఫ్యాకల్టీ లభ్యతను బలోపేతం చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్పులు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యతను పెంచడానికి, ఫ్యాకల్టీ లభ్యతను బలోపేతం చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫ్యాకల్టీ అర్హతల) రూల్స్ – 2025 ను జారీ చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (PGMEB) ఈ నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం.. 220కి పైగా పడకలున్న నాన్-టీచింగ్ ప్రభుత్వాస్పత్రులను టిచింగ్ ఇన్‌స్టిట్యూషన్‌గా గుర్తిస్తారు. అలాగే 10 ఏళ్ల అనుభవం ఉన్న స్పెషలిస్టులను అసోసియేట్ ఫ్రొఫెసర్ గా, 2ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించొచ్చు. వీరికి సీనియర్ రెసిడెన్సీ తప్పనిసరి కాదు కానీ బేసిక్ కోర్స్ ఇన్ బయోమెడికల్ రీసెర్చ్ (బీసీబీఆర్) రెండేళ్లలో పూర్తి చేసి ఉండాలి. అంతేగాక ఎన్ బీఈఎంఎస్ గుర్తించిన ప్రభుత్వ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్లలో మూడేళ్ల టీచింగ్ అనుభవం ఉన్న సీనియర్ కన్సల్టెంట్లు ప్రొఫెసర్ పదవికి అర్హులు అవుతారు. డిప్లమా హోల్డర్లు గవర్నమెంట్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌లో స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నవారు, మొత్తం 6 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా అర్హత పొందుతారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచే లక్ష్యాన్ని ప్రకటించింది. అయితే అర్హత కలిగిన ఫ్యాకల్టీ కొరత ఉండటంతో ఎన్ఎంసీ పై నిర్ణయం తీసుకుంది.
ఒకేసారి యూజీ, పీజీ కోర్సులు
కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకేసారి యూజీ, పీజీ కోర్సులు ప్రారంభించొచ్చు. పీజీ కోర్సులు ప్రారంభించడానికి ఇప్పటివరకు ముగ్గురు ఫ్యాకల్టీ, ఒక సీనియర్ రెసిడెంట్ అవసరం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇద్దరు ఫ్యాకల్టీ, 2 సీట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకే ఎంఎస్సీ పీహెచ్ డీ చేసిన ఫ్యాకల్టీ అర్హులు. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. మైక్రోబయాలజీ, ఫార్మకోలజీ విభాగాల్లోనూ ఎంఎస్సీ పీహెచ్‌డీ ఫ్యాకల్టీని నియమించుకోవచ్చు. ప్రీ-క్లినికల్, పారా-క్లినికల్ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ల నియామకానికి గరిష్ట వయసు పరిమితిని యాబై ఏళ్లకు పెంచారు.






