- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా బుర్ర విలువ రూ.200 కోట్లు.. మోసం చేసి సంపాదించే అవసరం లేదు: గడ్కరీ
తన బుర్ర విలువ నెలకు రూ.200 కోట్లు ఉంటుందని, తనకు ఎవర్నీ మోసం చేసి సంపాదించాల్సిన అవసరం లేదని నితిన్ గడ్కరీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: తన వ్యక్తిగత లాభం కోసమే ఈ20 పెట్రోల్‌ను తీసుకొస్తున్నారంటూ వస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరస్కరించారు. తన మెదడే నెలకు రూ.200 కోట్లు సంపాదించేంత విలువైనదని చెప్పిన ఆయన.. తను ప్రతిపైసా నిజాయితీగానే సంపాదిస్తానని, ఎవర్నీ మోసం చెయ్యనని చెప్పారు. ‘నా బ్రెయిన్ నెలకు రూ.200 కోట్లు సంపాదించేంత విలువైంది. నిజాయితీగా ఎలా సంపాదించాలో నాకు తెలుసు’ అని గడ్కరీ అన్నారు.
తన వద్ద డబ్బులకు కొదవ లేదని కూడా చెప్పారు. తన కొడుకులను వ్యాపారం విషయంలో తాను సలహాలు మాత్రమే ఇస్తానని, అంతేకానీ ఫ్రాడ్ చెయ్యనని గడ్కరీ తెలిపారు. ‘నా కొడుకు ఇటీవలే 800 కంటైనర్ల యాపిల్స్‌ను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. వెయ్యి కంటైనర్ల అరటిపండ్లను ఇరాన్‌కు ఎగుమతి చేశాడు. ఇరాన్‌తో డబ్బురూపేణా ఎలాంటి లావాదేవీలు లేవు. తను ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. నాకు ఒక షుగర్ ఫ్యాక్టరీ, ఒక డిస్టిలరీ, ఒక పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా స్వలాభం కోసం వ్యవసాయంతో ప్రయోగాలు చెయ్యను’ అని గడ్కరీ వివరించారు.






