- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో పేదలు పెరిగిపోతున్నారు.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో పేదలు పెరిగిపోతున్నారు అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సంపద కొద్దిమంది సంపన్నుల వద్దనే పోగుబడుతోందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో పేదలు పెరిగిపోతున్నారు అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సంపద కొద్దిమంది సంపన్నుల వద్దనే పోగుబడుతోందని అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, తయారీ, పన్నులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లాంటి అంశాలను ప్రస్తావించారు. సంపద వికేంద్రీకరణం అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.
నెమ్మదిగా సంపద అంతా సంపన్నుల చేతుల్లోకే వెళ్లిపోతుందని, పేదల సంఖ్య పెరిగిపోతుందని ఇలా జరగకూడదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు సృష్టించే, ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే ఆర్థిక వ్యవస్థ గురించి పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావులను ప్రశంసించారు. ప్రస్తుతం టోల్ గేట్ల ద్వారా తాము రూ.55 వేల కోట్లు సంపాదిస్తున్నామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.






