- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిత్యానంద ఆచూకీ వెల్లడించిన శిష్యురాలు.. హైకోర్టులో ఆసక్తికర పరిణామం
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆచూకీకి ఎట్టకేలకు తెరపడంది.

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద (Nithyananda) ఆచూకీకి ఎట్టకేలకు తెరపడంది. తనపై భారతదేశంలో ఎదురవుతున్న వివాదాల నేపథ్యంలో స్వామి నిత్యానంద ఇప్పుడు ఆస్ట్రేలియా (Australia) సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (USK) అనే ప్రత్యేక దేశంలో ఉన్నారని, ఆయన శిష్యురాలు అర్చన చెన్నై (Chennai) హైకోర్టు మధురై ధర్మాసనానికి గురువారం తెలియజేశారు.
ఈ వ్యాఖ్యలు నిత్యానందపై మదురై ఆధీనంలో ఉన్న ఓ మఠంలో ప్రవేశించవద్దని సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిత్యానంద దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గతంలో జరిగిన విచారణలో ధర్మాసనం ‘నిత్యానంద ఎక్కడ ఉన్నారు? కైలాస అనే దేశం వాస్తవంగా ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరమా?’ వంటి కీలకమైన ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.
ఈ కేసు తిరిగి విచారణకు రాగా, నిత్యానంద తరఫున హాజరైన శిష్యురాలు అర్చన.. ఆయన ప్రస్తుతం యూఎస్‌కే అనే స్వయంఘోషిత దేశంలో ఉన్నారని ధర్మాసనానికి స్పష్టం చేశారు. అలాగే, నిత్యానంద తరఫున కొత్త న్యాయవాదిని నియమించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, అభ్యర్థనకు అంగీకారం తెలిపి తదుపరి విచారణను వాయిదా వేసింది. నిత్యానంద స్థానికంగా కాకుండా విదేశాల్లో ఉన్నారని శిష్యురాలే స్వయంగా కోర్టుకు తెలియజేయడం ఈ కేసులో కొత్త మలుపుగా నిలిచింది.






