Nisar: భూమిని స్కాన్ చేసే ఉపగ్రహం.. ఈనెల 30న ప్రయోగం

by B.Srinivas |

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.

Nisar: భూమిని స్కాన్ చేసే ఉపగ్రహం.. ఈనెల 30న ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. నాసా, ఇస్రోల సంయుక్తంగా చేపట్టనున్న నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ మిషన్‌ (నిసార్‌) మిషన్‌ను జూలై 30న ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా నిసార్‌ శాటిలైట్‌ను నింగిలోకి పంపనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్16 ఈ ఉపగ్రహాన్ని 743 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో 98.40 డిగ్రీల వంపుతో ఉంచుతుంది. నిసార్ భూమి ఉపరితలాన్ని అధ్యయనం చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం. దీనికి రెండు వేర్వేరు బ్యాండ్ల రాడార్లు ఉండగా.. దట్టమైన అడవుల్లోనూ ఇది రాడార్ సహాయంతో డేటాను సులభంగా సేకరించనున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఈ శాటిలైట్ భూమిని స్కాన్ చేస్తుందని, స్వీప్‌సార్ టెక్నాలజీని మొదటిసారిగా అధిక రిజల్యూషన్‌తో ఉపయోగించామని ఇస్రో తెలిపింది. ప్రతి 12 రోజులకు మొత్తం భూమికి సంబంధించిన చిత్రాలను పంపడంతో పాటు వాతావరణంలోని మార్పులను గమనించనుంది.

Next Story