- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై నిమిషాల్లో నిఫా వైరస్‌ను గుర్తించవచ్చు!
దేశంలో నిఫా వైరస్ ఉధృతి నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ICMR)కి చెందిన జాతీయ వైరాలజీ సంస్థ (NIV), పుణె ఒక కీలక ముందడుగు వేసింది.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో నిఫా వైరస్ ఉధృతి నేపథ్యంలో, భారత వైద్య పరిశోధన మండలి (ICMR)కి చెందిన జాతీయ వైరాలజీ సంస్థ (NIV), పుణె ఒక కీలక ముందడుగు వేసింది. నిమిషాల్లోనే నిఫా (Nipah) వైరస్‌ను గుర్తించగలిగే పోర్టబుల్ ‘పాయింట్-ఆఫ్-కేర్ (Point-of-care)’ కిట్‌ను వారు అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ కిట్‌ను ఎక్కడైనా తక్షణం ఉపయోగించి, నిఫా వైరస్‌కు సంబంధించి తక్షణ ఫలితాలను పొందవచ్చు. మొబైల్ ల్యాబ్‌లా పనిచేసే ఈ కిట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇది ప్రత్యేకంగా నిఫా వైరస్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడిన ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ కిట్ కావడం విశేషం.
ఇక ఈ కిట్‌ను నిఫా వైరస్ కేసులు అధికంగా నమోదైన కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు NIV డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మన దేశంలో గతంలో గుర్తించిన నిఫా వైరస్ 'జినోటైప్ బి' రకం కావడం గమనార్హం. ఇది ఇతర రకాల వైరస్‌ల కంటే వేగంగా వ్యాపించడమే కాక, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. ఈ వైరస్ మనుషులకు ఎక్కువగా పండ్లపై ఉన్న కాలుషితపు సూక్ష్మజీవుల ద్వారా లేదా పందుల నుంచి సంక్రమిస్తుంది. ఇక ఈ వైరస్ సోకిన వారిలో మొదట దద్దుర్లు, జ్వరం వంటి కనిపించినా, త్వరలోనే మెదడు వాపు, మూర్చ, కఠినమైన శ్వాసకోశ సమస్యల వైపు దారితీస్తాయి. పైగా ఈ వైరస్‌కు సరైన చికిత్స లేకపోవడంతో మరణ శాతం కూడా భయంకరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం NIV రూపొందించిన ఈ కిట్ ఆరోగ్య శాఖలకు ఒక గేమ్‌చేంజర్‌గా నిలవనుంది. త్వరిత నిర్ధారణతోనే వైరస్ వ్యాప్తిని నియంత్రించి, అనేక ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది.






