మరోసారి నిఫా కలకలం.. ఈసారి బెంగాల్‌లో

by Muthe.Rajitha |

పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్‌ కలకలం రేపింది.

మరోసారి నిఫా కలకలం.. ఈసారి బెంగాల్‌లో
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్‌ కలకలం రేపింది. రాష్ట్రంలో ఇద్దరికి నిఫా వైరస్ లక్షణాలు కనబడటంతో మమతా బెనర్జీ ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. నార్త్ 24 పరగణాలలో బారాసత్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు హెల్త్‌కేర్ వర్కర్లకు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, మూర్ఛ, శ్వాస సమస్యలు వంటి నిఫా లక్షణాలు కనిపించాయి. దీంతో జనవరి 11న AIIMS కల్యాణిలోని ICMR ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో వీరికి నిఫా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

నిఫా అధిక డెత్ రేట్ కలిగిన ప్రమాదకర వైరస్ కావడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ జాయింట్ అవుట్‌బ్రేక్ రెస్పాన్స్ టీమ్‌ను వెంటనే బెంగాల్ కు పంపింది. ఢిల్లీలోని NCDCలో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను యాక్టివేట్ చేసి.. రోగుల కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్‌మెంట్ చర్యలు ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వైరస్ కాగా.. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మరణానికి దారి తీస్తుంది.

Next Story