- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Odisha: ఒడిశాలో అకాల వర్షాలు.. పిడుగుపాటుతో 9 మంది మృతి
అకాల వర్షాలతో ఒడిశా ప్రజలు అతలాకుతలం అవతున్నారు. రైతులతో పాటు సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలో శుక్రవారం మధ్యాహ్నం వర్షం బీభత్సం సృష్టించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అకాల వర్షాలతో ఒడిశా ప్రజలు అతలాకుతలం అవతున్నారు. రైతులతో పాటు సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలో శుక్రవారం మధ్యాహ్నం వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు (thunderstorms), మెరుపులు, ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు (Lightning Strikes) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోరాపుట్ జిల్లాలో ముగ్గురు, జాజ్‌పూర్, గంజాం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, దెంకనల్, గజపతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు చెప్పారు. కోరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిడిగూడ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రజలు గాయపడినట్లు వెల్లడించారు. మరోవైపు, కోరాపుట్, కటక్, ఖుర్దా, నయాగఢ్, జాజ్‌పూర్, బాలసోర్, గంజాం సహా అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. దాదాపు 60 నుండి 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ ఒడిశాకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.






