ట్రంప్ అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోండి.. భారత్‌కు నిక్కీ హేలీ సలహా!

by Phanindra |

రష్యా చమురు అంశంలో ట్రంప్ అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాలని భారత్‌కు నిక్కీ హేలీ సలహా ఇచ్చింది. ఇరుదేశాల మధ్య బంధాలు చాలా కీలకమని ఆమె చెప్పింది.

ట్రంప్ అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోండి.. భారత్‌కు నిక్కీ హేలీ సలహా!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తిన ప్రశ్నలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలని మరో రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ కోరారు. ఈ విషయంలో పరిష్కారం కోసం అమెరికాతో సాధ్యమైనంత త్వరగా చర్చలు జరపాలని సూచించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రెండు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల స్నేహం ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో చైనాను కౌంటర్ చేయడానికి భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవాల్సిన అవసరం యూఎస్‌కు ఎంతైనా ఉందని ఆమె అన్నారు.

రష్యా చమురు కొనుగోళ్లపై అభ్యంతరాలు, వాణిజ్యంలో విభేదాలు వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి చర్చించుకోవాలని, అప్పుడే ఈ సమస్యలను పరిష్కారం అవుతాయని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల్లో పడి చైనాను ఎదుర్కోవడం అనే ముఖ్యమైన అంశాన్ని మర్చిపోకూడదన్నారు. అంతర్జాతీయ శక్తిగా ఎదగాలని అనుకుంటున్న చైనాను కట్టడి చేయాలంటే యూఎస్‌కు భారత్ సహకారం తప్పనిసరి అని ఆమె గుర్తుచేశారు.

Next Story