- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NIA: ఎన్ఐఏ చేతికి పెహల్గామ్ ఉగ్రదాడి కేసు..!
పెహల్గామ్ ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా స్వీకరించింది. ఈ దాడికి సంబంధించి విచారణను చేపట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా స్వీకరించింది. ఈ దాడికి సంబంధించి విచారణను చేపట్టింది. కేంద్రహోంమంత్రిత్వశాఖ ఆదేశాలతోనే ఎన్ఐఏ కేసు విచారణను స్వీకరించింది. హోం మంత్రిత్వ శాఖలోని కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ (CTCR) విభాగం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు శనివారం రాత్రి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత ఎన్ఐఏ ఈ కేసుని అధికారికంగా చేపట్టింది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్-ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం దాడి జరిగిన మరుసటి రోజు బైసారన్‌ను సందర్శించింది. ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఎన్ఐఏ (NIA) బృందం దాడి జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి, మారణహోమానికి కారణమైన వారిని గుర్తించడంలో సహాయపడనుంది.
14 మంది ఉగ్రవాదుల జాబితా
దాదాపు ఇరవై సంవత్సరాలలో ఈ ప్రాంతంలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు పరిగణిస్తున్నారు. దర్యాప్తులో జమ్ముకశ్మీర్ పోలీసులకు ఎన్ఐఏ మద్దతివ్వడం ప్రారంభించింది. కేంద్రపాలిత ప్రాంతంలో యాక్టివ్ గా పనిచేస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను నిఘా సంస్థలు పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ ఈ చర్య తీసుకుంది. మూలాల ప్రకారం, 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఈ నిందితులు పాకిస్థాన్ నుండి విదేశీ ఉగ్రవాదులకు లాజిస్టికల్, గ్రౌండ్ లెవల్ మద్దతును అందించడం ద్వారా యాక్టివ్ గా సాయం చేస్తున్నట్లు అధికారులు గురించారు. ఇకపోతే, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పెహల్గమ్ లో ఉగ్రదాడి జరిగింది. కాగా.. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ ఘోరమైన దాడిపై ప్రస్తుతం ఎన్ఐఏ అధికారికంగా దర్యాప్తు చేపట్టింది.






