- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NIA searches: ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం ఎనిమిది రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏక కాలంలో భారీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబయి), హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అనుమానితుల నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం ఎనిమిది రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏక కాలంలో భారీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబయి), హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అనుమానితుల నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది. సోదాల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్థిక పత్రాలు, ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటాను నిశితంగా పరిశీలించి పాకిస్థాన్ గూఢచారి నెట్‌వర్క్‌పై ఆధారాలు సేకరిస్తున్నారు. 2023 నుంచి భారత దేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs) కు లీక్ చేస్తున్న వ్యక్తిని ఎన్ఐఏ మే 20న అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తికి భారత్‌లోని కొన్ని సంస్థల ద్వారా ఆర్థికంగా నిధులు అందినట్లు గుర్తించారు. ఆర్ధిక మార్గాల్లో పాకిస్తాన్ గూఢచారి కార్యకలాపాలను ప్రోత్సహించడంలో అతడి పాత్రను ఎన్ఐఏ నిర్ధారించింది.
అన్ని కోణాల్లో దర్యాప్తు..
ఈ కేసు నూతనంగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహితా (BNS) 2023 కింద వివిధ సెక్షన్లు, అక్రమ కార్యకలాపాలు నిరోధక చట్టం (UA(P) Act) 1967 కింద 18వ సెక్షన్ ఆధారంగా కేసు నమోదైంది. గూఢచారి ముఠాకు సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఇంకా వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. పాకిస్థాన్ గూడచార్యానికి ఎవరెవరూ సహకరించారు. నిధుల సమీకరణ ఎలా జరిగింది అన్ని కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.






