- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫలించిన NIA ఆపరేషన్.. ఖలిస్థానీ కీలక కార్యకర్త కశ్మీర్ సింగ్ అరెస్ట్
ఖలిస్తానీ ఆపరేటివ్ కాశ్మీర్ సింగ్ గల్వడ్డీ (Kashmir Singh Galvaddy)ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తానీ ఆపరేటివ్ కాశ్మీర్ సింగ్ గల్వడ్డీ (Kashmir Singh Galvaddy)ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారు బిహార్ (Bihar)లోని మోతీహారీలో స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ (Punjab)లోని లుధియానా ప్రాంతానికి కశ్మీర్ సింగ్ 2016 నభా జైలు నుంచి తప్పించుకుని గత కొంతకాలంగా పరారీలో ఉన్నాడు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ఉగ్రవాది హర్విందర్ సింగ్ సంధు, అలియాస్ రిండాతో అతడు మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లుగా విచారణలో వెల్లడైంది.
రిండా నేపాల్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లో కశ్మీర్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2022లో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ) దాడితో సహా ఖలిస్తానీ ఆపరేటివ్‌లకు ఆశ్రయం ఇచ్చాడు. అదేవిధంగా వారికి లాజిస్టికల్ సపోర్ట్, ఆర్థికంగా అండగా నిలిచాడు. కశ్మీర్ సింగ్‌కు బీకేఐ, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF), ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ (ISYF)లాంటి పెద్ద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. దీంతో 2022లో అతడిపై ఎన్‌ఐఏ ఓ ఉగ్రకుట్ర కేసులో నేరస్థుడిగా చేర్చింది. ప్రస్తుతం అతడిపై రూ.10 లక్షల రివార్డ్ కూడా ఉంది. అయితే, కశ్మీర్ సింగ్ అరెస్ట్‌తో ఖలిస్తానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌కు బలమైన ఎదురుదెబ్బ అని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.






