పహల్గాం ఉగ్రదాడి కేసులో NIA దర్యాప్తు ముమ్మరం.. సంచలన విషయాలు వెలుగులోకి

by Kema Shiva Kumar |

పహల్గాం ట్రెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.

పహల్గాం ఉగ్రదాడి కేసులో NIA దర్యాప్తు ముమ్మరం.. సంచలన విషయాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ట్రెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు విచారణను వేగవంతం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (Inspector General of Police), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Deputy Inspector General of Police), పోలీస్ సూపరింటెండెంట్ (Police Superintendent) పర్యవేక్షణలో ఎన్‌ఐఏ అధికారులు (NIA Officials) ఒక్కొక్కరిగా విచారిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాల్పులు జరిగిన స్పాట్‌లో అక్కడున్న వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

పహల్గాం (Pahelgam)లోకి ఎంటర్ అయి.. తిరిగి వెళ్లేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం (Forensic Team) సహాయంతో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గాం టెర్రర్ అటాక్ కుట్ర వెనుక లష్కరే- పాకిస్థాన్ ఐఎస్ఐ (Pakistan ISI) కలిసి పనిచేసినట్లుగా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్‌ (Pakistan)‌కు చెందిన ఓ సీనియర్‌ ఐఎస్‌ఐ అధికారుల మార్గనిర్దేశంలోనే లష్కరే ఉగ్రమూకలు పహల్గాంలో అమాయక టూరిస్టులపై దాడికి పాల్పడినట్లుగా సమాచారం. లష్కరే హెడ్‌క్వార్టర్‌ (Lashkar-e-Taiba Headquarters)లోనే ఉగ్రదాడికి సంబంధించి రూట్ మ్యాప్ రూపొందించారని NIA ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Next Story