Sunny Yadav : యూట్యూబర్‌ సన్నీ యాదవ్‌ను విచారిస్తున్న NIA

by Muthe.Rajitha |

యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌(YouTuber Bayya Sunny Yadav)ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) చెన్నై(Chennai)లో విచారిస్తోంది.

Sunny Yadav : యూట్యూబర్‌ సన్నీ యాదవ్‌ను విచారిస్తున్న NIA
X

దిశ, వెబ్ డెస్క్ : యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌(YouTuber Bayya Sunny Yadav)ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) చెన్నై(Chennai)లో విచారిస్తోంది. సన్నీ యాదవ్ ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్‌లో పర్యటించిన(Pakisthan Tour) నేపథ్యంలో.. అతడిని మే 29న చెన్నై విమానాశ్రయంలో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సన్నీ యాదవ్ సంబంధాలను ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. ఫిబ్రవరి 14-22 మధ్య సన్నీ లాహోర్, ఇస్లామాబాద్‌లో పర్యటించి, అక్కడి స్థానికులతో మాట్లాడిన వీడియోలను అప్‌లోడ్ చేశాడు.

ఈ పర్యటనలో అతడు భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ అధికారులకు షేర్ చేశాడా లేదా అని విచారిస్తున్నారు. ఈ విచారణ భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. కొందరు దీనిని రొటీన్ తనిఖీగా భావిస్తుండగా, మరికొందరు సన్నీ యాదవ్‌ను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శిస్తున్నారు.

Next Story