NIA: ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు

by Prasad Jukanti |   (  Updated:2025-05-17 06:57:49  IST  )

ఇద్దరు ఐసిసి ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

NIA: ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబయిలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ (NIA) అరెస్టు చేసింది. ఇండోనేషియా నుంచి మళ్లీ బారత్ లోకి ప్రవేశిస్తుండగా అబ్దుల్లా ఫయాజ్ షేక్ తల్హా ఖాన్ ను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టుచేశారు. ఆ తర్వాత వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఐసిస్ (ISIS) సానుభూతి పరులైన వీరు 2023లో ఉగ్రవాదుల కోసం పూణేలోని ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు గుర్తించారు. ఇదే కేసులో ఇప్పటికే ఎనిమిది మంది ఐసిసి సానుభూతి పరులను అరెస్టు చేశారు. వీరిద్దరు మాత్రం దర్యాప్తు అధికారుల కళ్లుగప్పి ఇండోనేషియా పారిపోయారు. అప్పటి నుంచి వీరు అక్కడే తలదాచుకున్నారు. అయితే వీరిద్దరిపై ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వీరి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ. 3 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. భారత్ లో శాంతి, మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తెలిపింది.

Next Story