జైల్లో ఉగ్రవాదికి సహకారం.. జైలు సైకియాట్రిస్ట్, ఏఎస్ఐ అరెస్టు!

by Phanindra |

బెంగళూరు జైల్లో ఉగ్రవాదికి సహకారం అందించిన జైలు సైకియాట్రిస్ట్, ఏఎస్ఐ అరెస్టయ్యారు. మొత్తం ముగ్గుర్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.

జైల్లో ఉగ్రవాదికి సహకారం.. జైలు సైకియాట్రిస్ట్, ఏఎస్ఐ అరెస్టు!
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు జైలు లష్కర్-ఎ-తైబా (ఎల్‌ఈటీ) మతోన్మాదం కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ జైల్లోని ఖైదీలను మతోన్మాదులుగా మార్చడంతోపాటు, బెంగళూరులో ఈ ఎల్‌ఈటీ దాడులకు పథకాలు వేసిన టి నజీర్ అనే ఉగ్రవాదికి ఒక పోలీసు అధికారి, ఒక జైలు సైకియాట్రిస్ట్ సహకరించినట్లు తేలింది. దీంతో వీళ్లిద్దరితోపాటు మొత్తం ముగ్గుర్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. 2023కు చెందిన జైల్లో ఎల్‌ఈటీ మతోన్మాదం కేసులో బెంగళూరు, కోలార్ జిల్లాల్లో తనిఖీల తర్వాత ఎన్ఐఏ ఈ అరెస్టులు చేయడం గమనార్హం.

ఈ తనిఖీల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, వాకీటాకీల వంటి డిజిటల్ డివైసులు తదితరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఎల్‌ఈటీ అజెండా ప్రకారం బెంగళూరు ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకే దాచినట్లు సమాచారం. 2023 జులైలో ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఉప్పందుకున్న అధికారులు పలుచోట్ల తనిఖీలు చేపట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే జైలు వ్యవస్థలో ఎల్‌ఈటీ మతోన్మాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ సంస్థ దర్యాప్తు చేయగా బెంగళూరు సెంట్రల్ జైల్లో సైకియాట్రిస్ట్‌గా ఉన్న డాక్టర్ నాగరాజ్.. జైల్లో ఉన్న ఎల్ఈటీ ఉగ్రవాది టి నజీర్ సహా పలువురికి మొబైల్ ఫోన్స్ అందించిటన్లు తేలింది. అదే సమయంలో ఏఎస్ఐగా ఉన్న చాన్ పాషా.. పలు ఎస్కార్ట్ షెడ్యూల్స్‌ను నజీర్‌కు వెల్లడించినట్లు దర్యాప్తులో తేలింది. మరో ఉగ్రవాద కేసులో పారిపోయిన జునైద్ అహ్మద్ అనే టెర్రరిస్టు తల్లి అనీస్ పాథిమా.. నజీర్ నుంచి సమాచారం అందుకొని దాన్ని తన కుమారుడికి అందజేసినట్లే వెల్లడైంది. దీంతో ఈ ముగ్గుర్నీ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

Next Story