మహిళలపై పెరిగిన దారుణాలు, గంటకు 51 ఎఫ్ఐఆర్‌లు..ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాకింగ్ ప్రకటన

by Ajay Maddhiboyina |

దేశంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైంద‌ని నొక్కిచెబుతూ ఎన్‌హెచ్ఆర్‌సీ (మానవ హక్కుల సంఘం) చైర్ పర్సన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై పెరిగిన దారుణాలు, గంటకు 51 ఎఫ్ఐఆర్‌లు..ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాకింగ్ ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైంద‌ని నొక్కిచెబుతూ ఎన్‌హెచ్ఆర్‌సీ (మానవ హక్కుల సంఘం) చైర్ పర్సన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భార‌త్ లో ప్ర‌తి గంట‌కు మ‌హిళ‌లు హింస‌కు గుర‌వుతున్న‌ట్టు దాదాపు 51 ఎఫ్ఐఆర్‌లు నమోదవుతున్నాయని తెలిపారు. పని చేసే ప్రదేశాల్లో, సమాజంలో మహిళల భద్రత అనే అంశంపై చర్చ జరిగిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో దేవతలను పూజించడం, మహిళలను హింసించడం భయంకరమైన వాస్తవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధించడానికి తీసుకువచ్చిన చట్టం 2023 అమలు వెనుక జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

Next Story