- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త లేబర్ కోడ్స్.. వారానికి 3 రోజుల వీక్ ఆఫ్!
కొత్త లేబర్ కోడ్స్ పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : కొత్త లేబర్ కోడ్స్ పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే నవంబర్ 21న 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్స్(వేజెస్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్) తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ లేబర్ కోడ్స్ ప్రకారం వారానికి 4 రోజుల పని దినాలపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. వారానికి 4 రోజులు పని చేసి 3 రోజుల వీక్ ఆఫ్ కావాలంటే వారు రోజుకు 12 గంటలు పని చేయాలని స్పష్టం చేసింది.
వారానికి మొత్తం 48 పని గంటలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. అయితే 12 గంటల కంటే ఎక్కువ పని చేస్తే ఓవర్ టైం జీతం డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇది వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పనిగంటలు తగ్గలేదని అంటున్నారు. అయితే కొన్ని సెక్టార్లలో మాత్రం (ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్)లో అమలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.






