- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్ ఆధార్‌పై కొత్త సవరణ.. ఇకపై అలా చేయలేరు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ నిబంధనలు 2016ను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా బాల్ ఆధార్ లో కొత్త సవరణ చేసింది. నకిలీ బాల్ ఆధార్ నమోదులను అంటే..

దిశ, వెబ్‌డెస్క్: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ నిబంధనలు 2016ను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా బాల్ ఆధార్ లో కొత్త సవరణ చేసింది. నకిలీ బాల్ ఆధార్ నమోదులను అంటే.. ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ డూప్లికేట్లను నిరోధించడమే ఈ సవరణ ప్రధాన లక్ష్యం. మరణించినవారి ఆధార్ నంబర్ ను డీ యాక్టివేట్ చేయడానికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
కొత్త నిబంధన ప్రకారం.. 5 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ నంబర్లను, కోర్ బయోమెట్రిక్స్ లేకుండా, జన్మ సర్టిఫికెట్ ఆధారంగా ఎన్‌రోల్ చేసినవి, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ చీఫ్ రిజిస్ట్రార్‌తో షేర్ చేయవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 ప్రకారం తల్లిదండ్రులు లేదా గార్డియన్ అనుమతితో జరుగుతుంది. ఈ పద్ధతి డూప్లికేట్ ఎన్‌రోల్‌మెంట్‌లను నిరోధిస్తుంది. ఒకే బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా రెండు వేర్వేరు బాల్ ఆధార్లను నిరోధించడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశ్యమని ఆధార్ సంస్థ తెలిపింది. బాల్ ఆధార్ నమోదుకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన పిల్లలకు ఆధార్ కావాలంటే.. వారి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.






