- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్షవాతం రోగులకు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్
ఇప్పటి వరకు ముగ్గురు పేషెంట్లకు న్యూరాలింక్ డివైజ్‌లు అమర్చాము. అవన్నీ చాలా చక్కగా పని చేస్తున్నాయని లాస్ వెగాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎలాన్ మస్క్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో:
న్యూరాలింక్ కార్ప్‌కు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ డివైజ్‌ను మూడో పేషెంట్‌కు విజయవంతంగా అమర్చారు. కొంత కాలంగా మానవ మెదడులో అమర్చే చిప్‌ల ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో వ్యక్తికి న్యూరాలింక్ చిప్ అమర్చినట్లు సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ ఏడాది మరో 20 నుంచి 30 మందికి ఈ న్యూరాలింక్ చిప్‌లు అమర్చేలా ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ముగ్గురు పేషెంట్లకు న్యూరాలింక్ డివైజ్‌లు అమర్చాము. అవన్నీ చాలా చక్కగా పని చేస్తున్నాయని లాస్ వెగాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎలాన్ మస్క్ వెల్లడించారు. పక్షవాతం, ఏఎల్ఎస్ అనే మెదడు, వెన్ను సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స అందించడానికి బ్రెయిన్ ఇంప్లాంట్స్‌ను న్యూరాలింక్ అనే సంస్థ తయారు చేస్తోంది. ఈ చిప్‌కు సంబంధించిన ఎలక్ట్రోడ్స్‌ను మెదడు టిష్యూల్లో అమర్చడానికి ముందుగా పుర్రె పైభాగాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నోలాండ్ అర్బాగ్ అనే పేషెంట్‌కు తొలి సారి ఈ చిప్‌ను అమర్చారు. ఇప్పటికే ఈ డివైజ్‌ను అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)వద్ద రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మొదటి దశలో ఈ చిప్‌లు అమర్చిన పేషెంట్లు తమ మైండ్ ద్వారా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను కంట్రోల్ చేయగలుగుతారా లేదా అనే విషయాలను అధ్యయనం చేయనున్నారు. రెండో దశలో పక్షవాతం వచ్చిన పేషెంట్లు రోబోటిక్ చేతులను కంట్రోల్ చేస్తారా అనే విషయాలను అధ్యయనం చేస్తారు.






