- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేనా రైలులో హైజీన్? అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ వీడియో చూసి నెటిజన్లు షాక్!ఐఆర్సీటీసీ రియాక్షన్ ఇదే!
రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై మరోసారి నెటిజన్‌లు ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Indian Railways) రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై మరోసారి నెటిజన్‌లు ప్రశ్నించారు. (amrit bharat express) అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ (16601) లో తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఒక సిబ్బంది వాడిన ఫుడ్ కంటైనర్లను రైలు సింక్ వద్ద కడిగి.. వాటిని జమ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్లీ వాడటానికి కడిగి వాటిని జమ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో (viral) వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాకింగ్‌కు గురయ్యారు. ఇదేనా రైలులో హైజీన్..? అంటూ పరిశుభ్రతపై రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఘటనపై అనేక మంది నెటిజన్‌లు రైల్వేకి ఫిర్యాదులు చేయగా, ఐఆర్సీటీసీ (IRCTC) వెంటనే స్పందించింది. ఆదివారం ట్విట్టర్ (X) వేదికగా ఐఆర్సీటీసీ అధికారికంగా ప్రకటిస్తూ.. ‘ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించాం. సంబంధిత వెండర్‌ను గుర్తించి వెంటనే తొలగించాం. లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అదనంగా భారీ జరిమానా కూడా విధించాం’ అని వెల్లడించింది. ఈ ఘటనతో రైలులో సరఫరా అవుతున్న ఆహారం పరిశుభ్రత, నాణ్యతపై నెటిజన్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్వీట్ ఇదే..
ఐఆర్సీటీసీ మరో ట్వీట్‌లో స్పష్టం చేస్తూ.. ‘ఈ వీడియోను వెంటనే పరిశీలించాము. ఆ కాసెరోల్‌ను ఒక్కసారే ఉపయోగించారు. పదే పదే వినియోగానికి ఉపయోగించలేదు. దానిని శుభ్రపరచి, పారవేయబడింది. ఈ విషయంపై నిర్వహించిన వాస్తవ విచారణ దీన్ని స్పష్టంగా నిరూపించింది. ఆ కాసెరోల్‌ను తిరిగి ఆహార వడ్డన కోసం ఉపయోగించారని వంటి తప్పు దారుణమైన వార్తలను ప్రచారం చేయవద్దు’ అని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వేండర్ స్టాఫ్ ప్రకటన ఐఆర్సీటీసీ పోస్ట్ చేసింది. మరో ట్వీట్..






