తొక్కిసలాట ఎఫెక్ట్: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్

by Gantepaka Srikanth |

బెంగళూరులోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

తొక్కిసలాట ఎఫెక్ట్: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 11 మంది ఆర్సీబీ(RCB) అభిమానులు మృతిచెందడం అందరనీ కలిచివేసింది. అయితే ఈ ఘటనలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని బాధ్యుడ్ని చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. కోహ్లీని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఆటలో కింగే.. దీనిని ఎవరం కాదనం కానీ.. జనాల ప్రాణాలు తీసేలా ఈవెంట్‌లు నిర్వహించడం ఏంటని మండిపడుతున్నారు.

మరోవైపు.. ఈ విషాద ఘటనపై కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) చర్యలు ప్రారంభించింది. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీలను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.





Next Story