Modi birthday: మీ అసలు పుట్టినరోజు ఎప్పుడు మోడీజీ? నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Ajay Maddhiboyina |

నేడు సెప్టెంబర్ 17వ తేదీ కావడంతో ప్రధాని మోడీ పుట్టిన రోజు అని ఆయనకు రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రధానికి విషెస్ చెబుతున్న పోస్టులే కనిపిస్తున్నాయి.

Modi birthday: మీ అసలు పుట్టినరోజు ఎప్పుడు మోడీజీ? నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ వెబ్ డెస్క్: నేడు సెప్టెంబర్ 17వ తేదీ కావడంతో ప్రధాని మోడీ పుట్టిన రోజు అని ఆయనకు రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రధానికి విషెస్ చెబుతున్న పోస్టులే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే మూడు పుట్టినరోజులు కలిగిన ఏకైక వ్యక్తి మోడీ అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. మోడీ స్కూల్ సర్టిఫికెట్లలో 29 ఆగస్టు 1949 అని ఉండగా బీఏ ప్రవేశపత్రంలో 1 అక్టోబర్ 1958 ఉందని తెలిపాడు. అంతే కాకుండా ప్రధాని కార్యాలయంలోని రికార్డుల్లో 17 సెప్టెంబర్ 1950 ఉందని పేర్కొన్నాడు.

వీటిలో మీ అసలు పుట్టిన రోజు ఏది అంటూ ప్రధానిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. మోడీ దేవుడిచ్చిన ప్రసాదం.. ఆయనే నాన్ బయాలాజికల్ అని ప్రకటించుకున్నారు కాబట్టి ఆయనకు పుట్టినరోజులు ఉండవు అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ పుట్టినరోజుపై కూడా అనుమానాలేనా అంటూ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రధాని మోడీ డిగ్రీపై అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుల వరకు సైతం వెళ్లింది. మోడీతో చవువుకున్న క్లాస్ మేట్స్ ఎవరూ లేకపోవడంతో ఆయన డిగ్రీపై మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story