- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన సయోధ్య..!
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. బందీలను విడుదల చేయడానికి ఇరువర్గాల మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. బందీలను విడుదల చేయడానికి ఇరువర్గాల మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈమేరకు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే కేబినెట్ సమావేశం తర్వాత ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భేటీ కానుంది. కేబినెట్ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే.. ఆదివారం నుంచి యుద్ధ విరమణ ఒప్పందం అమలుకావొచ్చని తెలుస్తోంది. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇకపోతే, చివరి నిమిషంలో రాయితీలను బలవంతంగా పొందడానికి ఒప్పందంలోని కీలక భాగాలను హమాస్ తిరస్కరించిందని గురువారం ఇజ్రాయెల్ ఆరోపించింది. కాగా.. ఆ ఆరోపణలను హమాస్ ఖండించింది. దీంతో, కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లు పేర్కొంది (Gaza ceasefire-hostage deal). అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ సయోధ్య కుదిరింది.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం
2023, అక్టోబర్ లో ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు విడుదల కాగా.. మరికొందరు చనిపోయారు.. ప్రస్తుతం 51 మంది మాత్రమే బందీలుగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు పెరిగాయి. హమాస్ కు మద్దతుగా హెజ్ బొల్లా, హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పరం మిసైల్ దాడులకు పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు.






